ప్ర‌ధాని మోదీతో ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్ భేటీ

  • రెండు రోజుల క్రితం ఢిల్లీకి గ‌వ‌ర్నర్‌
  • ఇప్ప‌టికే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ
  • సోమ‌వారంతో ముగియ‌నున్న గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీ టూర్‌
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ శ‌నివారం ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన తాజా ప‌రిస్థితుల‌పై వారిద్ద‌రూ చ‌ర్చించారు. ఇదిలా ఉంటే... రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన గ‌వ‌ర్న‌ర్ ఇప్ప‌టికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆదివారం కూడా ఢిల్లీలోనే ఉండ‌నున్న గ‌వ‌ర్న‌ర్‌.. సోమ‌వారం త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని విజ‌య‌వాడ తిరిగి రానున్నారు.

AP Governor
Biswabhusan Harichandan
Narendra Modi
Prime Minister

More Telugu News